గేద దూడల సంరక్షణ ;

          గేద దూడల సంరక్షణ తల్లి గర్భంలో వునప్పటి నుండి మొదలు కావాలి. అంటే చూడి గేదెలను బాగా మేపినట్లయితే ఆరోగ్యవంతమైన ఎక్కువ బరువు కలిగిన దూడ పుడుతుంది. దూడ పుట్టిన వెంటనే ముక్కులో ఉన్న జిగురు పదార్ధాన్ని తుడిచి వేయాలి. వంటి మీద వున్న జిగురు పదార్ధాన్ని తల్లి నాకనట్లయితే పొడి బట్టతో శుభ్రంగా తుడవాలి. బొడ్డును శరీరానికి రెండంగులాల  దిగువన దారంతో కట్టి ముడి దిగువ భాగంలో తుప్పు పట్టని కత్తీరతో కత్తిరించి టించరు అద్దాలి. ఇలా  చేయటం వలన చీము పట్టడం జరగదు. పుట్టిన అరగంటలోపు దూడకు జున్ను పాలు తాగించాలి. జున్ను పాలలోని వ్యాధి నిరోధక అంటి బాడిలు దూడలను వివిధ వ్యాధుల బారి నుండి కాపాడతాయి. జున్ను ;;పాలలో విటమిన్ ‘ఎ’, ఖనిజ లవణాలు  మామూలు పాల కంటే ౩ రెట్లు ఎక్కువగా వుండి దూడలకు చాలా బలవర్ధకమైన ఆహారంగా పనిచేస్తాయి. దూడలకు మొదటిసారి విరోచనం  కావటానికి కూడా జున్ను దోహదం చేస్తుంది. ఒకవేళ ఏదేని కారణం చేత తల్లి జున్ను పాలు దూడకు లభించినట్లయితే  ఒక కోడిగుడ్డు, అర టీ స్పూన్ఆముదం, 6౦౦

మి.లి. పాలు, 1౦,౦౦౦ ఐ.యు.విటమిన్ ‘ఎ’, 8౦ మి.గ్రా. ఆరియోమైసిన్ పొడి కలిపిన మిశ్రమాన్ని దూడకు ఇవ్యాలి. గాలి కుంటు వ్యాధితో బాధపడుతున్న గేదెకు జన్మించిన దూడకు తల్లి జున్ను పాలు తాగించకూడదు. వేరొక గేదె జున్ను పాలు గాని లేదా పైన పేర్కొన్న మిశ్రమాన్ని గాని ఇవ్వవచ్చు.

          ఇలా పెంచిన దూడ ప్రతిరోజూ 4౦౦-45౦గ్రా. పెరిగి రెండు సంవత్సరాల కాలంలో 2౦౦-25౦ కిలోల బరువు పెరిగి కట్టడానికి తయారవుతుంది. ఈ విధమైన పోషణకు 4 వేలు ఖర్చయితే, మనకు 15 వేల నుండి 16 వేల విలువైన పాడి పశువు తయారవుతుంది.